
విద్యా శాఖకు సంబంధించి Gross Enrolment Ratio సర్వేలోని చేదు నిజాలు వెల్లడిస్తూ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లోని ముఖ్యాంశాలు:
• 5 సం. నుంచి 18 సం. మధ్య వయసుగల విద్యార్థులు 62,754 మంది మృతి చెందారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఈ ఆగస్టు వరకూ- చోటు చేసుకున్న పరిస్థితులపై సాగిన సర్వే ఇది. మచ్చుకు కొన్ని జిల్లాల్లో నమోదైన విద్యార్థుల మరణాలు:
తూర్పు గోదావరి – 10,545గుంటూరు – 6,422అనంతపురం – 4,165కర్నూలు – 3,283• స్కూల్ డ్రాపవుట్స్ : 3 లక్షల 88 వేల మంది ఉన్నారు. కనిపించని విద్యార్థులు: 2 లక్షల 29 వేల మంది ఉన్నారు. ఇప్పుడు మా పార్టీ వెల్లడిస్తున్న గణాంకాలు తప్పు అని వైసీపీ సర్కార్ చెప్పగలదా?
ఈ సర్వే ఎవరో కాదు సాక్షాత్తు విద్యాశాఖ వారే చేయించారు.ఈ సర్వేలో 13,676 గ్రామ సచివాలయాలు వాలంటీర్లు, 15,004 వార్డు సచివాలయ కార్యాలయాల వాలంటీర్లు పాల్గొన్నారు. వాళ్ళు సర్వే చేసి అందించిన వివరాలే ఇవి. ఆగస్టు నెలలోనే ఈ సర్వే చేశారు. వీటిని ఈ ప్రభుత్వ పెద్దలు ఈ వివరాలు సరికాదు – మా వాలంటీర్లు తప్పుడు సర్వేలు చేశారు అని చెబుతారా?
• ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం అని చెబుతోంది. వాళ్ళు చెబుతున్న లెక్కలు ఇవి..- నాడు నేడు : రూ.16 వేల కోట్లు – అమ్మ ఒడి: రూ.19,417 కోట్లు – విద్యా దీవెన/వసతి దీవెన: రూ.11,717 కోట్లు – మధ్యాహ్న భోజనం: రూ.1,824 కోట్లు – రాగి జావ : రూ.86 కోట్లు (ఇందులో సగం శ్రీ సత్యసాయి ట్రస్ట్ వారిదే)
• మరి ఇన్ని వేల కోట్లు వ్యయం చేస్తున్నా విద్యార్థుల మరణాలు ఎందుకు ఇంత అందోళనకరంగా ఉన్నాయో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.
• 5 సం. నుంచి 18 సం. మధ్య వయసు కలిగిన విద్యార్థినీ విద్యార్థులు ఇన్ని వేల మంది చనిపోయారు అని ప్రభుత్వం చేసుకున్న సర్వేలోనే తేలింది అంటే ఈ పాలకులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి.
• విద్యార్థుల మరణాలకు కారణాలు ఏమిటి? ఎందుకు ఇన్ని మరణాలు సంభవించాయో ముఖ్యమంత్రి చెప్పాలి.
• పిల్లల ఆరోగ్య సంరక్షణపై వీరికి ఏ మాత్రం బాధ్యత లేదు.
• ఇన్ని వేల మంది విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో చనిపోయారు అంటే కారణాలు ఏమిటనే విషయంపై అధ్యయనం చేయాలి.
• పౌష్టికాహార లోపంతో ఏమైనా చనిపోయారా అనేది చెప్పాలి.
• పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో ఎప్పటికప్పుడు విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్ చేయడంపై ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే సంగతి వెల్లడవుతోంది.
• 62,754 మంది విద్యార్థులు చనిపోయారు అంటే – ప్రతి ఒక్కరం స్పందించాలి. ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం.
• కనీసం గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల్లో వివిధ విభాగాల వైద్యులతో హెల్త్ క్యాంప్స్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది?
• పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు గంజాయి లాంటివి అందుతున్నాయి అని సమాచారం వస్తోంది. ఈ వ్యసనాలు కూడా ఒక కారణమా?• బాలికల వసతి గృహాల్లో తగిన సంరక్షణ చర్యలు ఉండటం లేదు. విద్యార్థినులు అనేక ఇబ్బందులుపడుతున్న విషయం మా దృష్టికి వచ్చింది.
• 5 – 18 సం. మధ్య ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు ఏమిటి? వారికి మెరుగైన వైద్యాన్ని అందించలేరా?
• ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేస్తున్న ముఖ్యమంత్రి పాఠశాల విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై ఏ మేరకు దృష్టిపెట్టారు?
• ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్ తోపాటు కనిపించడం లేదు అనే కేటగిరీ కూడా ఈ సర్వేలో కనిపించింది. ఇది చాలా విస్తుపోయే కేటగిరీ. ఆచూకీ లేకుండా కనిపించనివారి అనే కేటగిరీలో 2 లక్షల 29 వేల మంది ఉన్నారు. – ఆచూకీ లేని వారు అనే కేటగిరీపై మాకు అనేక సందేహాలు వస్తున్నాయి. వీరు కనిపించకుండా ఎలా పోయారా? వారి తల్లితండ్రులు ఎవరు? అదృశ్యమైపోయారా? – ఇలా ఆచూకీ లేకుండా వెళ్ళిపోయినవారిలో బాలికలు ఎందరు?- ఈ అంశంపై విద్యాశాఖ ఏమైనా విచారణ చేసిందా? అనే వాటికి పాలకులు, సంబంధిత ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి.
• ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జిఈఆర్ సర్వే రిపోర్ట్ వివరాలు బయటపెట్టాలి.
• విద్యార్థుల మరణాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఒక తరానికి నష్టం కలిగించారు.
• ముఖ్యమంత్రి విద్యార్థుల తల్లితండ్రులకు క్షమాపణ చెప్పాలి.