
పోలీసు శాఖలో 17 సంవత్సరాలు హోంగార్డుగా సేవలు అందించిన రవీందర్ తన ఉద్యోగం రెగ్యులరైజ్ కాదనే మనస్థాపంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, మృత్యువుతో పోరాడుతూ మృతి చెందడం అత్యంత దురదృష్టకరం. ప్రాణాపాయస్థితిలో ఉన్న హోంగార్డు రవీందర్‌ను బుధవారం రాత్రి నేను DRDO అపోలో ఆస్పత్రిలో పరామర్శించాను.
ముఖ్యమంత్రి #KCR హోంగార్డులను రెగ్యులరైజ్ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాడు. నిజంగా ఆ హామీ అమలైతే రవీందర్ బ్రతికి ఉండేవాడు. కానీ ఈ నియంత పాలకులకు హోంగార్డుల కష్టాలు,కనీళ్లు పట్టవు. తక్షణమే ప్రభుత్వం మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలి,ఆర్థికంగా ఆదుకోవాలి.
ఓ మాజీ #IPS అధికారిగా, మీ కుటుంబంలో ఒకడిగా చెబుతున్నా.. రాష్ట్రంలో హోంగార్డులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి హక్కులు సాధించుకోవాలి. రాష్ట్రంలో 20,000 మంది హోంగార్డుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా హోంగార్డుల పక్షాన #BSP పోరాడుతుంది.