
నల్గొండ: దేవరకొండలో నియోజకవర్గ బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
కేసిఆర్ మాటలకు చేతలకు పొంతన ఉండదు
కేసిఆర్ కు పేదలు, గిరిజనులు, దళితులు, బీసీలు ఎన్నికల సమయంలోనే గుర్తుకు వస్తారు
పేదలకు పది లక్షల ఇండ్లు ఇస్తానన్న కేసిఆర్, లక్ష ఇండ్లు కూడా పంచలేదు.చందంపేట మండలానికి చెందిన బాలికను హైదరాబాద్ లో చెరిచారంటే కేసిఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు
తెలంగాణ వచ్చిన తరువాత పొట్టచేత పట్టుకుని హైదరాబాద్ వచ్చిన వారికి ఒక్క రూపాయి అయిన సహాయం చేశావా ? 57 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్న కేసిఆర్ 60 ఏళ్లు దాటిన వారికి కూడా చాలా మందికి పెన్షన్ ఇవ్వడం లేదు
కేసిఆర్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు కానీ పాలన మొత్తం కేసిఆర్ దే2018 ఎన్నికల్లో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానన్న కేసిఆర్ ఇప్పటికీ ఇవ్వలేదు.
దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది ప్రజలను మచ్చిక చేసుకోవడానికే..
గుండంబా తయారు చేయకండి అని చెప్పి మనకేదో మేలు చేసిండు అనుకున్నాము, కానీ గల్లీలో మద్యం షాపులు తెరిచాడు
సంక్షేమ పథకాలకు ఇచ్చే డబ్బు కన్నా మద్యం ద్వారా వసూలు చేస్తున్న డబ్బే ఎక్కువ
Slbc వద్ద కుర్చీ వేసుకుని కూర్చుని పూర్తి చేస్తానన్న కేసిఆర్ మాట ఏమైంది? భూ కబ్జా చేశానని కేసిఆర్ నన్ను వెళ్ళగొడితే నా బొమ్మతో గెలిచా, కేసిఆర్ నా మీద పిలగాన్ని ఎందుకు పెడతావు నువ్వే రా అంటే రాలేకపోయాడు.
నీ పథకాలకు, మద్యానికి, బిర్యాని ఆశపడే జాతి తెలంగాణ జాతి కాదు
ప్రపంచంలో ఎవరేమి చేస్తున్నారో ప్రజలకు క్షణాల్లో తెలుస్తుంది.
సారి కేసిఆర్ చేతిలో మోసపోతే గోస పడతాం. వచ్చే ఎన్నికల్లో దేవరకొండలో బీజేపీ జెండా రెపరెపలాడుతుంది అని ఈటల రాజేందర్ అన్నారు..