
ఆయన కుటుంబానికి 25 లక్షలు ఎక్స్ గ్రేషియో, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
కూనం నేని సాంబశివరావు..
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లి ఆత్మహత్య పాల్పడి మృతి చెందిన హోంగార్డు రవీందర్ మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరిగింది. ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్త చేశారు. హోంగార్డు రవీందర్ ఆత్మహత్య చేసుకున్న పోలీస్ శాఖ, హోం మంత్రి స్పందించకపోవడం, కనీసం కుటుంబ సభ్యుల పరామర్శించకపోవడం బాధాకరమన్నారు. వేతనాలు ఇవ్వలేదని అడిగినందుకు కొందరు దూషించడంతో మనస్థాపానికి గురై రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డులు అనేక సమస్యలు, ఉద్యోగాల క్రమబద్ధీకరణ లేకపోవడంతో సతమతమవుతున్నారని అన్నారు. రవీందర్ మృతదేహాన్ని చూడడానికి వస్తున్న హోంగార్డులను అడ్డుకోవడం అన్యాయమన్నారు. పోరాడి హక్కులు సాధించుకోవాలని ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడకూడదని సాంబశివరావు అన్నారు. వెంటనే హోంగార్డ్ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని, మృతి చెందిన రవీందర్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియో తో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులను చేస్తామని చెప్పారని ఇప్పటికి వారి ఉద్యోగాల క్రమబద్ధీకరణ జరగకపోవడంతో రవీందర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చొరవ తీసుకొని, హోం మంత్రి స్పందించాలని చాడా డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కే మణికంఠ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.