
యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్ల ఆందోళన..
రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. నిజాం కాలేజ్ లో ఆందోళన..
గన్ పార్క్ వద్దకు ర్యాలీగా వెళ్లిన వారిని అడ్డుకున్న పోలీసులు..
ఆందోళన చేస్తున్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు..
హైదరాబాద్ నిజాం కాలేజీ లో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఆందోళన.
12 యూనివర్సిటీ లలో పెన్ డౌన్ లో భాగంగా గన్ వరకు ర్యాలీకి పిలుపు.
ప్రభుత్వాన్ని అనేక రకాలుగా విజ్ఞప్తి చేసినా.. తమను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదు.
సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని..అమలు చేయడం లేదు.
ఎంతో మందికి పాఠాలు చెప్పాం.. గొప్ప వారు అయ్యారు.. పోలీసులు అయ్యారు..
ఇపుడు ఆ పోలీసుల చేత మమ్మల్ని అరెస్ట్ చేయిస్తున్నారు.
ఇంత దారుణమా.. మాకు న్యాయం చేయాలి..
ఎన్నికల వరకు మా హామీని నెరవేర్చలేదు..ఇంకెప్పుడు చేస్తారు.
వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్.
ఈ విషయం పై సీఎం కేసీఆర్ స్పందించి న్యాయం చేయకపోతే.. 11వ తేదీ నుండి ఆందోళనలు ఉదృతం చేస్తాం.
తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్స్ సంఘం