
హోం గార్డ్ రవీందర్ మృతి పట్ల ట్వీట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన YSRTP రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
రవీందర్ మరణం కు కేసీఆర్ ప్రభుత్వమే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల
వైఎస్ షర్మిల ట్వీట్
- కేసీఆర్ నియంత పాలనలో మరో నిండు ప్రాణం బలైపోయింది.
- రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినా కేసీఆర్ కు..
- హోం గార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలన్న మనసు లేకపోవడం బాధాకరం.
- పాతబస్తీకి చెందిన హోం గార్డు రవీందర్ సకాలంలో జీతం అందక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.
- రవీందర్ చావుకు ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వమే కారణం.
- డబుల్ బెడ్ రూం ఇండ్లన్నారు, హెల్త్ కార్డులన్నారు..
- జీతాలు పెంచుతమని ప్రగల్భాలు పలికారు..
- హోం గార్డుల జీవితాలు మారుస్తామని అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్దాలు చెప్పారు…
- హోం గార్డులను రెగ్యులరైజ్ చేస్తామని కేసీఆర్ 2017లో హామీ ఇచ్చినా నేటికీ చేయలేదు
- సమయానికి జీతాలు రావు, కనీస గౌరవం లేదు
- నీ నిర్లక్ష్యానికి ఇంకెన్ని ప్రాణాలు బలవ్వాలి దొరా..
- హామీ ఇచ్చిన విధంగా 20 వేల మంది హోంగార్డులను తక్షణమే పర్మినెంట్ చేసి,
- డబుల్ బెడ్ రూం ఇండ్లు, హెల్త్ కార్డులు ఇచ్చి మాట నిలబెట్టుకోండి.
- ఆత్మహత్య చేసుకున్న రవీందర్ కుటుంబానికి 50 లక్షల పరిహారం చెల్లించి,
- అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం.