తెలంగాణ ప్రజల సమిష్టి పోరాటాలు త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా తుంగలో తొక్కింది. బిఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అంతులేని విద్రోహం జరిగింది. కెసిఆర్ ప్రభుత్వం అడ్డు అదుపు లేని అవినీతికి పాల్పడుతోంది. తెలంగాణ అప్పు ఐదు లక్షల కోట్లకు దాటింది.
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య విభజన, మత విద్వేషాలను తీవ్ర స్థాయిలో రెచ్చగొడుతుంది. వీరి పాలన అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఫాసిస్ట్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తుంది. ప్రజల తక్షణ జీవిత సమస్యల ఎజెండా కనుమరుగై, మత ఎజెండా ప్రధానమైంది. అశేష ప్రజలపై మోయలేని భారీ పన్నులు వేస్తూ, బడా పెట్టుబడిదారీ కార్పొరేట్ అనుకూల విధానాలను అనుసరిస్తుంది. 3 వ సారి అధికారం కొరకు బిజెపి ఎంతటి మారణకాండ కైన సిద్ధంగా వుంది.
బీఆర్ఎస్, బీజేపీ పైకి శత్రువులుగా నటిస్తున్నా వీరిద్దరి మధ్య గాడమైన బంధం ఉంది. గత తొమ్మిదిన్నర ఏళ్ల ఆచరణ వీరి బంధాన్ని రుజువు చేసింది. దేశ ప్రజలకు బిజెపి, రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ ప్రమాదకరంగా పరిణమించాయి.
ఈ నేపథ్యంలో వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఐ (ఎంఎల్), న్యూ డెమక్రసీ, సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా, ఎంసీపీఐ (యు), సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఆర్ఎస్పీ, ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ మరియు అనేక లౌకిక ప్రజాస్వామిక శక్తులు కలిసి, ఒక ఉమ్మడి కార్యచరణకై ఒక వేదిక పైకి రావాలనే ఉద్దేశంతో, గత కొన్ని వారాలుగా పై పార్టీలు సంస్థల మధ్య అనేక దఫాలుగా విస్తృత చర్చలు జరిగాయి. కనీసం ఉమ్మడి కార్యచరణ కొరకు ఒక విధాన పత్రాన్ని రూపొందించుకోవడం జరిగింది.
ఈ వేదిక పేరు “తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక (TELANGANA STATE DEMOCRATIC FORUM (TSDF) గా ఏకగ్రీవంగా నిర్ణయం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక చైర్మన్ గా జస్టిస్ చంద్రకుమార్, కన్వీనర్ గా ఆకునూరి మురళి (రిటైర్డ్ ఐఏఎస్ అధికారి). ప్రతి పార్టీ నుండి ఒక్కో కో కన్వీనర్ ఉండాలనే నిర్ణయాలతో పాటు, కోఆర్డినేటర్ గా నైనాల గోవర్ధన్ లను పై అందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఉమ్మడి కార్యచరణ కొరకు, విధాన పత్రాన్ని విడుదల చేయడం కై, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాదులో తేదీ 11.9.2023 న ఉదయం 11:30 గంటలకు ప్రకటిస్తామని జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు.