
అదుపుతప్పి పల్టీ కొట్టిన హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం
చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రోడ్డు ప్రమాదం రోడ్డు ప్రమాదం లో గాయపడిన హైకోర్టు న్యాయమూర్తి సుజాతను తన హైదరాబాద్ కు తరలింపు
న్యాయమూర్తి సుజాతకు తీవ్ర గాయాలు.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలింపు
తన కాన్వాయ్ మధ్యలో అంబులెన్స్ ద్వారా న్యాయమూర్తి సుజాతను హైదరాబాద్ కు తరలించిన మంత్రి జగదీశ్ రెడ్డి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరి సమీపంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి సుజాత ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ప్రమాదం లో న్యాయ మూర్తి సుజాత తీవ్రంగా గాయపడింది. దీంతో పోలీసులు ప్రధమ చికిత్స కోసం సుజాతను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయంలో తిరుమలగిరిలో ఓ శుభకార్యానికి హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకుని సుజాత ఆరోగ్య పరిస్థిితిపై ఆరా తీశారు.
మెరుగైన చికిత్స అవసరం ఉందని వైద్యులు చెప్పడంతో , వెంటనే మూడు జిల్లాల ఎస్పీలని అలెర్ట్ చేసి, సూర్యాపేట నుండి హైదరాబాద్ వరకు జాతీయ రహదారి పై ఉన్న పోలీసు స్టేషన్ సిబ్బందిని ట్రాఫిక్ క్లియరెన్స్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
వర్షం కురుస్తుండటం తో ఇబ్బందులు తలెత్తకుండా న్యాయమూర్తి సుజాతని తరలించే అంబులెన్స్ ను తన కాన్వాయ్ మధ్యలో ఉంచి రక్షణగా హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం న్యాయమూర్తి సుజాతకు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు..