
రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరిన చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెం. 7691 కేటాయించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. రాజమండ్రి జైలులోని స్నేహ బ్లాక్లో ఆయనకు ప్రత్యేక గది కేటాయించారు. భద్రతా కారణాల వల్ల మిగితా ఖైదీలతో కాకుండా బాబుకు ప్రత్యేక గది ఏర్పాటు చేయాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకు జైల్లో కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. దాంతో బాబుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునే వీలుంది. మందులు కూడా ఇంటి నుంచి వస్తాయి. చంద్రబాబుకు ఉండే ప్రత్యేక సెక్యూరిటీ ఎన్ఎస్జీని తాత్కాలికంగా తొలగించారు. బాబు బెయిల్ కోసం ఆయన లాయర్లు ప్రత్యేక లంచ్ పిటీషన్ వేశారు.