
సీఎం కేసీఆర్పై పోటీ చేసేందుకు బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సై అంటున్నారు. ఆమె గజ్వేల్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. బీజేపీ ఆశవహుల నుంచి పార్టీ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జమున గజ్వేల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తూ దరఖాస్తు చేశారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక ఈటల రాజేందర్ పలుమార్లు కేసీఆర్పై పోటీ చేస్తానని ప్రకటించారు. ఆయనను ఓడిస్తానని కూడా సవాల్ విసిరారు. దీంతో ఆయనే గజ్వేల్ బరిలోకి దిగుతారని తొలుత అందరూ భావించారు. కానీ రాజేందర్ హుజురాబాద్ నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తన భార్యను మాత్రం గజ్వేల్ బరిలో దించడానికి నిర్ణయించుకోవడం గమనార్హం.