
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి కి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీం లో సవాలు చేసిన సునీతారెడ్డి
విచారణ జరపనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం
వివేకా హత్య కేసు లో A 8 గా ఉన్న అవినాష్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
మే 31న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్ లో పేర్కున్న సునితారెడ్డి
అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం పై ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన సిబిఐ
వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేసారంటూ అఫిడవిట్ లో పేర్కొన్న సిబిఐ
రాజకీయ వైరం తోనే వివేకా హత్య జరిగిందని స్పష్టం చేసిన సిబిఐ
గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని పేర్కొన్న సిబిఐ
అవినాష్ రెడ్డి పాత్ర పై ఇంకా దర్యాప్తు చేయాలన్న సిబిఐ
వివేకా వెంట కారులో ప్రయాణిస్తూనే గంగిరెడ్డి నిందితుడు సునీల్ కి ఫోన్ చేసినట్లు పేర్కొన్న సిబిఐ
ఆ సమయం లో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్న సునీల్ యాదవ్
వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డి లే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్న సిబిఐ