
వేతనాలు పెంచడంతో పాటు మిగిలిన డిమాండ్ లు.పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ లు సోమవారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. దీంతో సమ్మె పై సర్కార్ సీరియస్ గా వ్యవహరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఇందులో భాగంగా అంగన్వాడీ లు సమ్మెకు టెంట్ లు వేసెలోపే ఎంపిడివో, ఎంపీ ఓ , ఐసీడీఎస్ సూపర్వైజర్ ల బృందం అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టి సెంటర్ లు ఓపెన్ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యత ఐకేపీ సిబ్బంది కి అప్పగించినట్లు ఎంపిడిఓ నసురుల్లా ఖాన్ పేర్కొన్నారు.