
లావు తగ్గాలనుకుంటున్నారా? స్లిమ్‌గా కనబడాలనుకుంటున్నారా? ఆమ్లా టీతో శరీరంలోని ఫ్యాట్‌తో పాటు బరువు కూడా బాగా తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు. పైగా ఆమ్లా టీని అన్ని సీజన్లలో ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా వేగంగా బరువు తగ్గడానికి ఈ టీ ఎంతో బాగా పనిచేస్తుందట. సహజంగా సన్నబడేలా ఆమ్లా టీ చేస్తుంది. బ్లడ్ షుగర్ ప్రమాణాలను సైతం ఆమ్లా క్రమబద్ధీకరిస్తుంది.ఇక ఆమ్లా వల్ల మనం పొందే ఆరోగ్య ప్రయోజనాలకు లేక్కే లేదని న్యూట్రిషినిస్టులు చెబుతారు. అలాంటి ఆమ్లా ఆయుర్వేద టీ చేసే మేలు ఎంతోనంటున్నారు ఆరోగ్యనిపుణులు. బరువు తగ్గించే డైట్ లో ఆమ్లా వినియోగాన్ని న్యూట్రిషనిస్టులు తప్పనిసరిగా చేరుస్తారు.
ఆమ్లా జ్యూసు అయితే శరీరంలోని ఫ్యాట్ ను వేగంగా కరిగిస్తుంది. ఆమ్లాటీలో ఉపయోగించేవన్నీ వంటింట్లో దొరికేవే. ఆమ్లా పొడిలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ మీద బాగా పనిచేస్తాయి.బరువు పెరగడానికి, ఇన్ఫ్లమేషన్ కు సంబంధం ఉందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక ఆమ్లాలో పీచుపదార్థాలు కూడా ఎక్కువే. ఇవి జీర్ణక్రియ బాగా జరిగేట్టు చేస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ ఉన్నప్పుడు బరువు సులువుగా తగ్గుతారు. ఆమ్లా కాలరీలను కరిగిస్తుంది. శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను బయటకు పంపి శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. శరీరానికి కావలసినంత శక్తినిస్తుంది.
బరువును తగ్గించే ఆమ్లా టీని చేయడం చాలా సులువు. ఒకటింబావు కప్పు నీళ్లు తీసుకోవాలి. ఒక టీస్పూను ఎండు ఉసిరి పొడి తీసుకోవాలి. అలాగే తాజా అల్లం ముక్కను దంచి రెడీ పెట్టుకోవాలి.ముందు చెప్పినట్టు రెడీ పెట్టుకున్న నీళ్లల్లో ఉసిరి పొడి, దంచిన అల్లం వేసి నీళ్లను సన్నని మంటపై మరగనివ్వాలి. ఆ నీళ్లు ఒక కప్పు వచ్చే వరకూ మరిగించి స్టవ్ మీద నుంచి దించి వడగట్టాలి. తర్వాత దాన్ని అలాగే తాగొచ్చు. తీయగా తాగాలనుకుంటే అందులో ఆర్గానిక్ తేనె కొద్దిగా వేసి బాగా కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్న వారు తేనె వేసుకోకుండా ఈ టీని తాగాలి. ఆమ్లా టీని రోజుకు రెండుసార్లు తాగితే శరీరంలోని ఫ్యాట్ కరుగుతుంది. బరువు కూడా వేగంగా తగ్గుతారు.