
గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని ప్రకటించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
రెండు వారాల్లోగా కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశం
ఇప్పటికే డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఈ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణ
గద్వాల ఎమ్మెల్యే ఎన్నిక వ్యవహారం పై సుప్రీంకోర్టు లో విచారణ
గద్వాల ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ప్రకటించడం పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి
తెలంగాణ హైకోర్టు తీర్పు పై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు
ఎన్నికల సంఘానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం
తదుపరి విచారణ నాలుగు వారాలు వాయిదా.
డీకే అరుణను ఎమ్మెల్యేగా గుర్తిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
ఈమేరకు గెజిట్ విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చిన ఈసీ.
ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన డీకే అరుణ
బ్యాంకు అకౌంట్లను వెల్లడించకపోవడం తప్పేనని అంగీకరించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది సుందరం
అయితే అవి డిపాజిట్లు కాదని, సేవింగ్స్ అకౌంట్స్ కావడం వల్లనే వెల్లడించలేదన్న న్యాయవాది.
అవి కూడా కృష్ణమోహన్ రెడ్డి భార్య పేరు మీద ఉన్నాయన్న న్యాయవాది.
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి చెందిన స్థలాన్ని గతంలోనే విక్రయించినట్లు పేర్కొన్న లాయర్ సుందరం
అందుకు సంబంధించిన సెల్ డెడ్, పత్రాలు కోర్టు ముందు ఉంచిన పిటిషనర్.
2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని కోర్టును ఆశ్రయించిన డీకే అరుణ
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని ప్రకటించిన తెలంగాణ హైకోర్టు
ఈ ఏడాది ఆగస్టు 24న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పై స్టే ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపంకర్ దత్త ధర్మాసనం
బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..
డీకే అరుణ హైకోర్టును తప్పుదోవ పట్టించారు
ఫోర్జరీ డాక్యుమెంట్లతో తప్పుడు సమాచారం ఇచ్చారు
హైకోర్టును తప్పుదోవపట్టించిన డీకే అరుణకు శిక్ష తప్పదు
డీకే అరుణపై న్యాయపోరాటం చేస్తా.
నాకు నోటీసులే అందలేదు. అందుకే ఎక్స్-పార్టీ జడ్జిమెంట్ వచ్చింది
హైకోర్టు తీర్పులోనే ఈ విషయాన్ని ప్రస్తావించారు
నాకు నోటీసులు అందినట్టు నా సంతకాలు ఫోర్జరీ చేశారు
ఎమ్మెల్యేగా ఉన్న నాకు నోటీసులు ఎక్కడైనా ఇవ్వొచ్చు
నేను 28వేల ఓట్ల మెజారిటీతో గెలిచాను. ప్రజల్లో గెలవలేక ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు
వచ్చే ఎన్నికల్లో 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తా.
ఆమె కనీసం పోటీలో కూడా ఉండదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక బీజేపీ నేతలు ఇలా చేస్తున్నారు
సుప్రీంకోర్టులో స్టే లభించింది. న్యాయం నావైపే ఉంది.
న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. సుప్రీంకోర్టులో నాకు న్యాయం జరుగుతుంది.