
పద్మనాభ రెడ్డి, సెక్రటరీ, ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెస్స్ మీట్ పాయింట్స్..
భారత దేశంలో ఎన్నికల కోసం అత్యధిక ఖర్చు పెట్టే ది తెలంగాణలోనే
కోట్ల రూపాయలు ఎన్నికల కోసం నాయకులు ఖర్చు చేస్తున్నారు
ప్రజలు వారి ఓటును అమ్ముకోవద్దు
ఎన్నికల నోటిఫికషన్ వచ్చిన తరువాత 25 వేల కంటే ఎక్కువ ఎవరు డబ్బు తీసుకొని వెళ్ళినా ఎన్నికల కమిషన్.. పోలీసులు కేసు పెట్టాలి
ఎన్నికల్లో డబ్బు తరువాత లిక్కర్ ప్రభావం తీవ్రంగా ఉంది
ఎన్నికల రోజు..ఫలితాల రోజు మాత్రమే లిక్కర్ షాపులు బందు చేస్తున్నారు
అలా కాకుండా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి లిక్కర్ షాపులను బందు చేయాలి
కరోనా టైం లో నెల రోజులు బందు చేశారు..అప్పుడు ఎంటువంటి సమస్య రాలేదు
డబ్బుకు మద్యం కు లొంగకుండా నిజాయితీ గా ఓటు వేసిన వారే సమస్యల పై నాయకున్ని ప్రశ్నించగలుగుతారు
ఓటర్ల లో అవేర్నెస్ రావడం కొరకు ప్రత్యేక వీడియోను రూపొందించి ఈ రోజు విడుదల చేశాం
ఓటర్ల కు అవగాహన కలిగేలా భవిష్యత్తు లో మరిన్ని వీడియోలు విడుదల చేస్తాం