
సెప్టెంబర్ 17 ను సమైక్యత దినంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడాన్ని తప్పు పట్టిన కిషన్ రెడ్డి
పార్టీ స్టేట్ ఆఫీసులో ప్రెస్ మీట్.. వివరాలు
సమైక్యత దినం ఎలా అవుతుందో చెప్పాలని డిమాండ్
కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే విమోచన దినంగా జరపాలని సవాల్ చేస్తున్నా..
రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని కేసీఆర్ ను కోరుతున్నా..
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిపే విమోచన దినోత్సవం…బీజేపీ ఆధ్వర్యంలో కాదు, కేంద్రం ఆధ్వర్యంలో జరుగుతుందనేది కేసీఆర్, కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి
ఈసారి కూడా ఈ ఉత్సవాలకు రావాలని కేసీఆర్ తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపుతాం
గత ఏడాది అసదొద్దిన్ ఓవైసీ అనుమతి ఇవ్వనందున కేసీఆర్ ఈ ఉత్సవాలకు రాలేదు
మరి ఈసారి ఓవైసీ అనుమతి ఇస్తాడా…లేదా చూడాలి
కేసీఆర్…ఓవైసీ ఇద్దరు కలిసి ప్రగతి భవన్ లో కూర్చుండి మాట్లాడుకొని..తెలంగాణ చరిత్రను తప్పుదారి పట్టించేoదుకు సమైక్యత దినంగా నిర్వహించాలని నిర్ణయించారు
కేసీఆర్ కు చేతనైతే విమోచన దినోత్సవంగా జరపాలి…లేదంటే ఇంట్లో కూర్చోవాలి
తెలంగాణ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేయవద్దని కేసీఆర్ ను కోరుతున్నా….
కాంగ్రెస్ కూడా ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేయాలి
కర్ణాటక, మహారాష్ట్రలో ఆక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న సమయంలో *హైదరాబాద్ విముక్త్ దినోత్సవ్* పేరుతో సెప్టెంబర్ 17 ఉత్సవాలు నిర్వహించారు
ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు మాత్రం…కాంగ్రెస్ సెప్టెంబర్ 17 ఉత్సవాలను నిర్వహించలేదు.
ఆనాడు కూడా మజ్లీస్ కు కాంగ్రెస్ భయపడి ఇక్కడ ఈ ఉత్సవాలను నిర్వహించలేదు
ఈసారి కూడా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరగనున్న ఉత్సవాలకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హాజరవుతారు
పారా మిలటరీ కవాతును స్వీకరించి, అక్కడే ఉన్న అమరవీరుల స్థూపంకు నివాళులు అర్పిస్తారు
రాష్ట్రపతి భవన్ లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి
తెలంగాణ ప్రజల తరపున రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ ఉత్సవాలను నిర్వహించాలని సర్పంచులకు నేను స్వయంగా కేంద్ర మంత్రి హోదాలో లేఖలు రాస్తాను