
ప్రముఖ సినీనటీ, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరుతున్నారు. బుధవారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునేందుకు ఆమె ఢిల్లీ బయలు దేరారు. గతంలో కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె ఈ దఫా పోటీలో నిలిచేందుకు ఆసక్తి చూపుతున్నారు. గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ ద్వారా ఆమె పార్టీలో చేరుతున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఇప్పటికే కిషన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. మరి కాసేపట్ల చేరిక జరగనుంది.