
ఈ రోజు ఉదయం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో బలపడి దక్షిణ ఒడిస్సా మరియు దక్షిణ చతిస్గడ్ మీదుగా కదిలే అవకాశం ఉంది. అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రానికి భారీ వర్ష సూచన. భారీవర్షములు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని (తూర్పు, ఉత్తర ) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు 7 జిల్లాకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలెర్ట్స్ జారీ చేశారు.
ఈ రోజు భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు అదిలాబాద్ కొమరంభీమ్,ఆసిఫాబాద్ మంచూరియా లేదా నిజామాబాద్ జగిత్యాల్ రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు వరంగల్ హనుమకొండ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది. నగరం లో ఈరోజు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఏందిజ
రేపు ఎల్లుండి నగరంలో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. రెండు రోజులు హైదరాబాద్ కి ఎల్లో అలెర్ట్స్ జారీ చేసిన వాతావరణశాఖ అధికారులు