
వరంగల్ దొంగలను పట్టుకున్న తర్వాత సీపీ రంగనాథ్ ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘క్రైమ్ మీటింగ్ జరుగుతుండగానే చోరీలు జరిగాయి. వరంగల్ నగరంలో 8 అపార్ట్మెంట్ లలో దొంగతనం చేశారు. ఈ ముఠా టోటల్ గా 32 దొంగతనాలు చేసింది. 8 నిమిషాల్లో ఒక్క దొంగతనం పూర్తి చేస్తారు. 3 ఢిల్లీ, 4 అదిలాబాద్, 5 వరంగల్, 6 బెంగళూర్ లో దొంగతనం చేశారు. డీపీసీ క్రైమ్స్ మురళి అధ్వర్యంలో ఆపరేషన్ జరిగింది. టోల్ గేట్ ఆధారంగా నిందుతులను పట్టుకున్నాం. వీరికి మరో 9 మంది సహకరించారు. ఈ ముఠాకు భారీ నెట్వర్క్ ఉంది. ఢిల్లీలో పోలీసుల సహకారం కూడా ఉంది. 11 అటెంప్ట్ చేశారు…8 చోరీలలో సక్సెస్ అయ్యారు. పట్టుపడిన దొంగలపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం. వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకుంటాం. ఘజియాబాద్ కు చెందిన అంతర్ రాష్ట్ర ముఠా 16 చోరీలకు పాల్పడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పది చోరీలు. గతంలో వంద వరకు చోరీలకు పాల్పడ్డ గ్యాంగ్. ఈ గ్యాంగ్ కు డిల్లీ, గజియాబాద్ పోలీసుల సహకారం ఉన్నట్లు సమాచారం ఉంది. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి చర్యలు తీసుకుంటామ’’ని సిపి రంగనాథ్ చెప్పారు.