
నిన్న ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం, ఈరోజు ఉదయం
తీవ్ర అల్పపీడనంగా బలపడింది
ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు పరిసరాల్లోని ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో ఉంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 7.6 కిమీ వరకు వ్యాపించి, ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశ వైపుకి వాలి ఉంది. ఇది రాగల 2 రోజులలో ఒడిస్సా మరియు చతిస్గడ్ మీదుగా కదిలే అవకాశం ఉంది.
తీవ్ర అల్పపీడనం కారణంగా రాష్ట్రానికి రెండు రోజులు భారీ వర్ష సూచన
ఈ రోజు భారీ నుండి అతిభారీ వర్షములు 4 జిల్లాలలో కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్స్ జారీ
4 జిల్లాల్లో భారీ వర్షాలతో ఎల్లో అలెర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు
భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో అదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల్, జగిత్యాల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్స్ జారీ
భారీ వర్షాలు రాష్ట్రంలో నిర్మల్ నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి అక్కడక్కడ కురిసే అవకాశం
రేపు భారీ వర్షంలు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని (ఉత్తర ) జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది* రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు
చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు రేపు రాష్ట్రములో ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ కొన్ని తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.
నగరానికి ఈరోజు భారీ వర్ష సూచన
ఈరోజు హైదరాబాద్ లో భారీ వర్షాల కురిసే అవకాశం ఉండడం తో ఎల్లో అలెర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ అధికారులు