
సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారని, దీని వల్ల 43వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగనుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలుపుతూ బుధవారం నిర్మల్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సీయం చిత్రపటానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
Rajakiya labdi kosame
ha
Yes
RTC assets nu kajeyadaniki short cut formula lo bhagame
ok