
డెంగ్యూ వ్యాధి తీవ్రం కావడంతో చిన్నారి పెనుగొండ ఆద్మశ్రీ (9) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందిన సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామంలో జరిగింది. ఆద్యశ్రీ గత కొన్ని రోజులుగా ఫీవర్ తో బాధపడుతుండగా భూపాలపల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ ల్లో ట్రీట్మెంట్ పొందుతుంది. అక్కడ ఆద్యశ్రీని పరీక్షించిన వైద్యులు చిన్నారికి డెంగీ ఉందని నిర్ధారించారు. ఆద్మశ్రీ పరిస్థితి సీరియస్ కావడంతో హనుమకొండలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. స్వర్ణ, రాజు దంపతుల కుమార్తె ఆద్యశ్రీ తో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. డెంగ్యూతో ఆద్యశ్రీ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. అలాగే, మండలంలోని వల్లెంకుంట, ఎడ్లపల్లి గ్రామాల్లో డెంగ్యూ ఫీవర్ విజృంభిస్తుంది. వైరల్ ఫీవర్లు గ్రామాల్లో విజృంభించడంతో తాడిచెర్ల పీహెచ్సీ పేషంట్లతో కిటకిటలాడుతుంది.–