
యాద్రాది జిల్లా అడ్డగూడూరు మండలంలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బొడ్డుగూడెం గ్రామ శివారులో ఆర్టిసి బస్సు బోల్తాపడడంతో చుక్క యాకమ్మ (50) కొండ రాములు (60) మృతి చెందారు. ఈ ప్రమాదంలో పది మంది గాయపడినట్టు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు తొర్రూరు నుండి జగదిరిగుట్ట వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు.