
కల్తీ పాల స్థావరాల పై ఎస్ఓటి పోలీసుల దాడి.
ఇద్దరు తయారుదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
ఇంట్లో కల్తీ పాలు తయారు చేస్తున్న స్తావరాలపై భువనగిరి ఎస్ఓటి పోలీసులు దాడి నిర్వహించారు. బుదవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి, కనుముక్కల గ్రామలలో కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవి,కుంభం రఘు లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 450 లీటర్ల కల్తీ పాలు, 300 ఎంఎల్ హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 డోలోఫర్ స్కిన్డ్ మిల్క్ పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్ కు అప్పచెప్పారు. కల్తీ పాలను టెస్టు నిమిత్తం ల్యాబ్ పంపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు