
హైదరాబాద్లో మెట్రో రైలును నలుమూలలా విస్తరిదంచాలని మంత్రి వర్గంలో చేసిన నిర్ణయంపై పలు అనుమానాలు కలుగుతున్నాయని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ అన్నారు. బుధవారం (ఆగస్టు 2) బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అరవై వేల కోట్ల రూపాయలతో ప్రపోజ్ చేసిన మెట్రో పనులు ఎప్పటికి పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీకే డబ్బులు లేవని సర్కారు అంటోందనీ, మరి మెట్రో రైలు విస్తరణకు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. ఆర్టీసీ విలీనం కూడా ఆస్తుల కోసం ఆశపడేనని ఆయన అన్నారు. లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులపై సీఎం కేసీఆర్ కన్నేశారని ఆయన ఆరోపించారు. ఆర్టీసీ భూములు, ఆస్తులను ముట్టుకుంటే బీజేపీ చూస్తూ ఉరుకోదనీ, దీనిపై పోరాటం చేస్తామని హెచ్చరించారు.