
బీఆర్ఎస్లో చేరికపై గాయకుడు ఏపూరి సోమన్న క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక వీడియో ద్వారా తన సందేశాన్ని షేర్ చేసుకున్నారు. తానెందుకు బీఆర్ఎస్లో చెప్పారు.
గత 24 ఏళ్లుగా గాయకునిగా ఉన్న తాను రకరకాల రాజకీయ వేదికలు చూశానన్నారు. ఇపుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తాను బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. గత రెండేళ్లుగా వైఎస్సాఆర్ టీపీలో ఉన్నాననీ, సోదరి షర్మిల తనను ఎంతో ఆదరించారని చెప్పారు. తనను ఒక నాయకునిగా గుర్తించారన్నారు. అంతేకాక ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేశారన్నారు.
కానీ తాను ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోక తప్పడ లేదన్నారు. గత తొమ్మిదేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ పాలన ఉందనీ, ఆయన పాలనను ప్రజలు ఆదరించారన్నారు. కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఇన్నేళ్ల అభివృద్ధి చూసి తాను బీఆర్ఎస్లో చేరుతున్నానని చెప్పారు.
ఇకపై తన ఆట, పాట అంతా అభివృద్ధిలో భాగంగా సాగుతుందన్నారు. తన స్నేహితులు, అభిమానులు, కళాకారులు తన నిర్ణయాన్ని ఆశీర్వదించాలని ఆయన కోరారు.