
రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద భారీ భద్రత.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబును విచారించేందుకు అనుమతించిన కోర్ట్..
చంద్రబాబును జైల్లోనే విచారించనున్న సిఐడి అధికారులు
చంద్రబాబు ఆరోగ్యం, వయస్సును దృష్టిలో పెట్టుకుని.. కొన్ని షరతులు విధించింది
చంద్రబాబు ఆరోగ్యం, భద్రత దృష్ట్యా జర్నీ అవసరం లేకుండా జైల్లోనే విచారించాలని ఆదేశించిన కోర్ట్
ఉదయం 9:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రశ్నించే అవకాశం
విచారణలో మొత్తం 12 మందిని జైల్లోకి అనుమతి. 9 మంది అధికారులతో పాటు ఒక వీడియో గ్రాఫర్ ఇద్దరు మీడియేటర్లకు అనుమతి
ఏడుగురు న్యాయవాదులు విచారణ జరిగే ప్రాంగణంలో ఉండవచ్చనేది కోర్ట్ ఆదేశం.
కస్టడీకి తీసుకునే ముందు బాబుకు వైద్య పరీక్షలు.
విచారణ సందర్భంగా పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు.
న్యాయవాది సమక్షంలో చంద్రబాబును విచారించాలి..
విచారణలో న్యాయవాదులు జోక్యం చేసుకోకూడదు
విచారణ సందర్భంగా చంద్రబాబుకు అవసరమైన మెడికల్ సదుపాయం అందుబాటులో ఉంచాలి.
మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల వరకు లంచ్ విరామం ప్రతి గంటలో ఐదు నిమిషాల పాటు బ్రేక్.
విచారణ సమయంలో చంద్రబాబు తరపున ఇద్దరు లాయర్లు ఉండడానికి అనుమతి
బ్రేక్ సమయంలో చంద్రబాబు తన కౌన్సిల్‌తో మాట్లాడే వెసులుబాటు.
న్యాయవాదికి కనిపించేలా చంద్రబాబును విచారించాలి.
విచారణ మొత్తం వీడియోగ్రఫీ చేయాలనేది కోర్ట్ ఆదేశం. దర్యాప్తుపై పూర్తి గోప్యత పాటించాలనీ.. సీల్డ్ కవర్లో కాపీని సమర్పించాలని ఆదేశించిన కోర్ట్
సీఐడీ డీఎస్పీ ధనంజయుడు నేతృత్వంలో ఒక సీఐ, ఇద్దరు గెజిటెడ్ ఆఫీసర్ల సమక్షంలో ఈ విచారణ.
రాజమండ్రి జైల్లో మాజీ సీఎం స్థాయి వ్యక్తిని విచారించడం ఇదే తొలిసారి కావడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు