
టాలివుడ్ డ్రగ్స్ కేసులో సినీ హీరో నవదీప్‌ను ఇవ్వాళ నార్కోటిక్స్ టీమ్ విచారించనుంది. ఈ మధ్య మాదాపూర్‌లో నార్కోటిక్ వింగ్ జరిపిన ఒక దాడిలో డ్రగ్స్ బయటపడ్డాయి. ఇందులో సినీ రంగానికి చెందిన కిందరు వ్యక్తులు పట్టుబడ్డారు. ఆ రంగానికి చెందిన వాళ్లే ఈ దందా నిర్వహిస్తున్నట్లు కనుగొన్నారు. ఈ కేసులో నవదీప్‌కు ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు.
డ్రగ్స్ సప్లయర్ రాంచందర్‌ను ఈ క్రమంలో పోటీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతర్వాత నవదీప్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు ఆయనను విచారించేందుకు ప్రయత్నిస్తే అందుబాటులోకి రాలేదు. నవదీప్ ఈ లోపున బెయిల్ కోరుతూ కోర్టులో పిటీషన్ వేశారు. కానీ దానికి కోర్టు అనుమతించలేదు.
ఈ కేసు విచారణలో నవదీప్ ప్రమేయం ఉందనీ, ఆయన నుంచి కొంత సమాచారం రాబట్టాల్సి ఉందని పోలీసులు కోర్టులో వాదించారు. గతంలో కూడా నవదీప్‌కు డ్రగ్స్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు తెలిపే ఆధారాలు చూపించారు. దాంతో కోర్టు ఆయన విచారణకు అనుమతించింది. నార్కోటిక్స్ పోలీసులు ఆయనకు తాజాగా నోటీసులు ఇచ్చి విచారణ చేపడుతోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ ఏ–29గా ఉన్నారు.