
బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు త్వరలో కాంగ్రెస్లో చేరనున్నారు. రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేశాక మైనంపల్లి పోటీ చేసే స్థానం పట్ల చర్చ మొదలైంది. ఆయన కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తారనీ, మెదక్ నుంచి ఆయన కుమారుడు పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.
మైనంపల్లి స్వయంగా ఈ ఊహాగానాలకు తెర దింపారు. తాను మల్కాజ్గిరి వదిలి ఎక్కడికి వెళ్లననీ, తనకు గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మల్కాజ్గిరి ప్రజలకు సేవ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఎలాంటి ప్రచారాలు నమ్మవద్దని ఆయన కోరారు.