
ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ లో స్వల్ప మార్పు చేశారు. ఆయన అక్టోబర్ 1న రాష్ట్రానికి వస్తున్నారు. సెప్టెంబర్ 30న రావాల్సిన ఆయన టూర్ లో మార్పులు చేశారు. ఆయన మహబూబ్‌నగర్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలు భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. లక్ష మందితో సభ నిర్వహించాలని అనుకుంటున్నారు.
మోదీ మహబూబ్‌నగర్ సభనే ఎన్నికల శంఖారావ సభగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. అక్టోబర్‌లో ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో ఆయన రాక ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనపై చర్చించేందుకు కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఢిల్లీ నివాసంలో భేటీ జరిగింది.
మోదీ టూర్‌పై చర్చించేందుకు రాష్ట్ర పార్టీ ఇంఛార్జులు తరుణ్ ఛుగ్, సునీల్ బన్సల్, ప్రకాశ్ జగదేవ్కర్లు కిషన్ రెడ్డితో సమావేశం అయ్యారు. దీంతో ఈ రోజు ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావాల్సి ఉన్న బీజేపీ ఎంపీల ప్రయాణం వాయిదా పడింది.