
ఖమ్మంలో భట్టి కామెంట్స్ :
రాష్ట్ర సంపదను , వనరులను కాపాడాలని కాంగ్రెస్ భావిస్తుంది. వాటిని దోచుకోవాలని బిఆర్ఎస్ భావిస్తున్నది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని భావించే వారు కాంగ్రెస్ వైపు వస్తున్నారు.
కాంగ్రెస్ ద్వారా ధర్మం గెలవబోతా ఉంది. ప్రజలు గెలవబోతున్నారు.
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రావ్యాప్తంగా 74 నుంచి 78 సీట్లు కైవసం చేసుకోబోతుంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అధికారం వచ్చిన మొదటి వంద రోజుల లోపు అమలు చేస్తాం..
రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి .. కాంగ్రెస్ గ్యారంటీ కార్డులను జాగ్రత్తగా పెట్టుకోండి. గ్యారంటీ కార్డు ఉంటే అన్ని పథకాలు లభిస్తాయి.
ఫీజు రియంబర్స్ మెంట్ తో పాటు అదనంగా రూ.5 లక్షలు అందజేస్తాం.
ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలం 15 ఎకరాల్లో కడతాం.
స్కూల్ కు వచ్చే పిల్లలకు బస్సుల సౌకర్యం కలిపిస్తాం.
తెలంగాణలో సంపద ఉంది కాబట్టి అమలు చేస్తాం..
తెలంగాణ సంపదను దోచుకోకుండా ప్రజల సంక్షేమం కోసం పంచుతాం.
బిఆర్ఎస్ లాగా మాయ మాటల స్కీంలు ప్రకటించడం లేదు.
కాంగ్రెస్ ను చూసి బిఆర్ఎస్ నాయకులు ఆగమాగం అవుతున్నారు.
వంద శాతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది.
బిఆర్ఎస్ అక్రమంగా అమ్మిన భూముల పై చట్టపరంగా చర్యలు తీసుకోని ప్రజలకు పంచుతాము.
కార్యకర్తలు రోడ్డు మీదనే ఉండండి. చీమ చిటుక్కు మన్న కాని కాంగ్రెస్ నాయకులం అండగా ఉంటాం.