
తెలంగాణలోని వివిధ వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాకతీయ యూనివర్సిటీలో లెక్చరర్లు నిరవధిక ఆందోళన చేస్తున్నారు. సోమవారం మొదలైన ఆందోళన కొనసాగుతోంది. తమను రెగ్యులరైజ్ చేయాలని లెక్చరర్లు విధులు బహిష్కరించారు. కేయూ వీసీ భవన్ ముందు బైటాయించి తన నిరసనను కొనసాగిస్తున్నారు. 12 విశ్వవిద్యాలయాలలోని 1445 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులపే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకు పోరాటం ఆపబోమన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు కొనసాగుతున్నాయి.