
దేశంలో భారత రాజ్యాంగం కొనసాగుతున్నదా లేదా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం అమలవుతున్నదా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై తీరు పట్ల ఆమె మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రతిపాదనను తోసి పుచ్చడాన్ని ఆమె తప్పుబట్టారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకంగా ఉందనడానికి ఇది మరో ఉదాహరణ అని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో కూడా ఇదే తీరులో వ్యవహరించారన్నారు. రాజ్యాంగబద్ధమైన సంప్రదాయాలను కాలరాయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. సర్కారు సిఫారసును కాదనడం సరికాదని కవిత అభిప్రాయపడ్డారు.