
బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గురువారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు కుమారుడు రోహిత్ కూడా కాంగ్రెస్లో చేరారు. వీరిరువురూ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరికి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. కాగా బీఆర్ఎస్ మరో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కూడా వీరితోపాటు కాంగ్రెస్లో చేరారు.