
సీఎం కేసిఆర్ ఇంకా జ్వరంతో బాధపడుతున్నారు. ఆయనకు ప్రగతి భవన్లోనే చికిత్స అందుతోంది. వైద్యులు ఎప్పటికప్పుడు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తున్నారు. కేసిఆర్ ఆరోగ్యం నిలకడగానే వున్నట్లు తెలుస్తోంది. కాగా, కేసిఆర్ ఆరోగ్య పరిస్తితి దృష్ట్యా ఇవ్వాళ జరగాల్సిన కేబినేట్ మీటింగ్ వాయిదా పడింది. అక్టోబర్ మొదటి వారంలో ఈ భేటీ నిర్వహించే అవకాశం వున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెపుతున్నాయి.