
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చండీ యాగం చేస్తున్నారు. కొడంగల్లో ఆయన శుక్రవారం భార్య, కూతురు, అల్లుడితో కలిసి యాగంలో పాల్గొన్నారు. మూడు రోజుల పాటు యాగం జరగనుంది. మొదటి రోజు యాగం పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కొడంగల్ నియోజక వర్గ ప్రజలకు మంచి జరగాలని యాగం చేపట్టానన్నారు. భారీ పంటలు పండి రైతులు సకల ఐశ్వర్యాలతో తులతూగాలన్నారు. నియోజక వర్గంలో గతంలో సహకరించినట్లే ఇపుడు కూడా తనకు సహకరించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరిగి రాష్ట్రం బాగుపడాలని ఆశించారు.

