
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గోవెన గ్రామానికి చెందిన ఈ బాల బాలికలు మూడు కిలో మీటర్ల దూరంలోని భీమన్ గొంది ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే.. నిత్యం గోవెన గ్రామం పక్కనే ఉన్న ఈ వాగును దాటాల్సిందే.
దీంతో బాల బాలికల తల్లిదండ్రులు దగ్గరుండి ప్రతిరోజు ఇలా వాగు దాటిస్తుంటారు.వీరితోపాటు నాయకపు గూడెం గ్రామానికి చెందిన విద్యార్థుల తో కలిపి మొత్తం 25 మంది భీమన్ గొంది ప్రాథమిక పాఠశాలకు నిత్యం ఇలానే వాగు దాటి వెళ్లి వస్తుంటారు.
ప్రతిరోజు విద్యార్థులు పడుతున్న కష్టాలు స్థానిక నాయకులకు కనబడడం లేదా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కనీసం వాగుపై నడక వంతెననైనా నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు నాయకులను అధికారులను కోరుతున్నారు…..