ఢిల్లీలో మీడియాతో నారా లోకేష్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి..

చంద్రబాబు పై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు
బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి అన్నారు
అన్ని నియోజక వర్గాల్లో ప్రజలు ఆందోళన చేస్తారు
సీఐడీ వైసీపీ అనుబంధ విభాగం..లేని కేసును తీసుకువచ్చారు
ఇన్నర్ రింగ్ రోడ్ లేదు కానీ, స్కాం ఉందట..నేను నిరసన తెలిపాను
ఐఓ, డిజిపి పైన సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తా
తప్పు జరగలేదు, కుంభకోణం జరగలేదు.. ఏనాడూ తప్పు చేయలేదు. మేం వాళ్ళ లాగా క్విడ్ ప్రోకో చెయ్యలేదు
అక్టోబర్ 4 న వంద శాతం సిఐడి ముందు హాజరవుతా. మాకు జగన్, సాయిరెడ్డి లాగా
వాయిదాలు అడిగే అలవాటు లేదు
ఇవి దొంగ కేసులు, ఎలాంటి ఆధారాలు లేవు.. మేం పారిపొం..సిఐడి వాళ్ళు వచ్చి లవ్ లెటర్ ఇచ్చారు..
ఈ కేసులన్నీ కక్ష్య సాదింపే .. ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు
అజయ్ కల్లామ్ కు నోటీసులు ఇవ్వకుండా నాకు నోటీసులు ఇచ్చారు రాజకీయంగా ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రజల కోసం పనిచేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు
మోత మోగిద్దాం తో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు
జగన్ ని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి లాక్ వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.
ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి కేసులో ఇరికించారు.
అధికారులు వచ్చినప్పుడు కొన్ని రోజుల నుంచి లోకేష్ ఎక్కడికో వెళ్లిపోయారన్న ప్రచారం చేస్తున్నారని అడిగాను.
సిఐడి అధికారులు నిలదీసినప్పుడు ఈరోజు ఉదయాన్నే మేము వెళ్లి వచ్చామని చెప్పారు.
సిఐడి తీరు సరిగా లేదు వీలైతే సిఐడి డీజీపై సుప్రీంకోర్టులో ఈ అంశాన్ని ప్రస్తావిస్తాం.
హెరిటేజ్ లో నేను షేర్ హోల్డర్ ని మాత్రమే.
అమరావతి కోర్ క్యాపిటల్ నుంచి హెరిటేజ్ భూములు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.
నేషనల్ హైవే నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్ సంస్థ ఒక ప్లాంట్ పెట్టాలని గతంలో నిర్ణయం తీసుకున్నాం.
మా ఇల్లు మా సంస్థలు మా పేర్లపై ఉంటాయి , జగన్ నివసించే ఇల్లు వారి పేరు మీద ఉండదు కంపెనీ పేర్లపై ఉంటుంది.
ముఖ్యమంత్రి జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి.
మేము ఎలాంటి తప్పు చేయలేదు నాలుగో తేదీన సిఐడి విచారణకు హాజరవుతాము
మేము తప్పు చేసి ఉంటే మా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేవి కానీ అవి ఎక్కడ వాళ్ళు చూపించలేకపోయారు.
మాకు పరిపాలన కొత్త కాదు.. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు అధికారం కొత్త కాదు ఏనాడు తప్పు చేయలేదు.
స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ గ్రీడ్ ఇన్నర్ రింగ్ రోడ్ లో నా పాత్ర లేదు అయినా కేసు బుక్ చేశారు
ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాం ప్రకటించిన ఆస్తుల కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉన్న మా ఆస్తులు అంత ప్రభుత్వానికి రాసిస్తాం.