
ప్రధాని మోదీ ఈ రోజు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఆయన మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి మీటింగ్ కోసం మహబూబ్‌నగర్‌కు బయలుదేరుతారు. ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన 2.10 గంటలకు మహబూబ్‌నగర్ వెళ్లారు. 2.15 నుంచి 2.50 వరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా ప్రారంభోత్సవం చేస్తారు. ఇది అధికారిక కార్యక్రమం. తర్వాత పొలిటికల్ సభ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 4.45 గంటలకు తిరికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకుతారు. కాగా మోదీ పర్యటన నేపథ్యంలో మళ్లీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. మోదీకి తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు లేదంటూ పోస్టర్లు వెలిశాయి. ఆంధ్రప్రదేశ్ లో పోలవరం ప్రాజెక్టు, కర్నాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారనీ, తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు మాత్రం ఇవ్వలేదంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు.