
ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కు పేటెంట్ హక్కును జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ విద్యార్థికి దక్కిన మొట్టమొదటి పేటెంట్ ప్యాడి ఫిల్లింగ్ మిషన్ పేటెంట్
- రూపకర్త అభిషేక్ కు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందన
- వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు
చెందిన విద్యార్థి మల్లారం అభిషేక్ రూపొందించిన ప్యాడి ఫిల్లింగ్ మిషన్ కేంద్ర ప్రభుత్వం పేటెంట్ హక్కు జారీ చేసింది.
హన్మాజీపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 2019లో 8వ తరగతి చదివే సమయంలో అభిషేక్ ధాన్యాన్ని సంచులలో సులభంగా నింపే యంత్రాన్ని తయారుచేశారు.
ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి IDOC లో అభిషేక్ , గైడ్ టీచర్ వెంకటేష్, ప్రధాన ఉపాధ్యాయులు అభినందించారు.
ఇప్పటికే ఈ ఆవిష్కర ణకు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో బహుమతులు వచ్చాయి.
ప్రస్తుతం హైదరాబాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న అభిషేక్ జపాన్ లో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు కూడా ఎంపిక అయ్యారు.