
కోకాపేటలోని భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దేశంలోనే హైయ్యెస్ట్ ధర పలుకుతోంది. ప్రభుత్వం కోకాపేట భూముల వేలాన్ని చేపట్టింది. గురువారం నాటి వేలంలో ఎకరం 75.25 కోట్లు పలికింది. ఫ్లాట్ నెంబర్ 9లో ఈ ధర పలికింది. అక్కడ 3.5 ఎకరాలు ఈ ఫ్లాట్లో ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం వేలం వేసిన భూముల్లో ఇదే హైయ్యెస్ట్ అని అధికారులు చెబుతున్నారు. గతంలో కోల్కతాలో ఎకరా 72 కోట్లు దాటింది. దాన్ని కోకాపేట్ ధరలు క్రాస్ చేశాయి. వేలం ఇంకా కొనసాగుతోంది. నియో పోలీస్ ఫేజ్ 2లో మొత్తం 45 ఎకరాలను వేలానికి పెట్టారు.