
తనని మోడల్‌గా చూడాలనుకునన భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఒక మహిళ తనకు ఎదురైన అనుభవానికి ఖంగు తింది. తన జుట్టును ఇంకా బాగా మేకోవర్ చేయించుకోవాలని ఆమె ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడ ఆమె జుట్టును కట్ చేసి ఒక ఆయిల్ పెట్టారు. ఇదేంటని అడిగితే నీ జుట్టు సూపర్‌గా తయారవుతుందని పార్లర్ నిర్వాహకురాలు చెప్పింది. దాంతో ట్రీట్మెంట్కు ఓపిక పట్టిన ఆమె ఇంటికి వచ్చింది. పార్లర్లో రాసిన ఆయిల్‌కు ఆమె జుట్టు ఊడడం మొదలుపెట్టింది. మొత్తం జుట్టు ఊడి వచ్చింది. ఇదేమిటని పార్లర్ వాళ్లను అడిగితే మొత్తం గుండు చేయించుకోవాలనీ, నాలుగైదు నెలల ఓపిక పడితే మొత్తం జుట్టు వస్తుందని ఉచిత సలహా ఇచ్చారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన మహిళ ఆబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా భార్య చేసిన పిచ్చి పనికి భర్త చివాట్లు పెట్టి ఇంటి నుంచి పంపేయడం కొసమెరుపు.