అసెంబ్లీలో బీజేపీకి ప్లేస్ కేటాయించక అవమానించారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తాము కూర్చోవడానికి స్థలం లేక నిజాం క్లబ్లో వెయిట్ చేసి అసెంబ్లీకి రావాల్సి వచ్చిందన్నారు. బీఏసీ సమావేశానికి కూడా పిలవక పోవడం దారుణమన్నారు. గతంలో ఒక ఎమ్మెల్యే ఉన్న లోక్‌సత్తాకు బీఏసీకి ఆహ్వానం ఉండేదన్నారు. సమైక్య పాలకులకు ఉన్న సోయి స్వరాష్ట్రంలో లేకపోవడం దారుణమన్నారు. బీజేపీకి శాసన సభా పక్ష కార్యాలయం కేటాయించకపోవడం అత్యంత అవమానకర చర్చ అన్నారు. ఈ రోజు ఉదయం స్పీకర్‌కు ఫోన్ చేసి తామెక్కడ కూర్చోవాలని కూడా అడిగామన్నారు. అయినా ఎలాంటి స్పందన లేదని ఆయన బాధపడ్డారు.