
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. కాంగ్రెస్ పక్షాన సీఎల్పీ నేత సమావేశాలు 20 రోజుల పాటు నిర్వహించాలని కోరామన్నారు. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయనీ, వాటిపై చర్చకు ఆస్కారమీయాలన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మూడు రోజులు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. శనివారంతో సమావేశాలు ముగియనున్నాయి.