
మహబూబ్ నగర్ ప్రజా గర్జన సభలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు తీపి కబురు చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. దాంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో బోర్డు ఏర్పాటు ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తూ రైతులు సంబరాలు చేశారు. మీటింగ్‌లో ప్రధాని మోదీ మాట్లాడిన అంశాలు..
తెలంగాణలో రూ.13500 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ల చట్టం సాధించాం.
తెలంగాణలో ఎన్నో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాం.
హైవేల నిర్మాణంతో అన్ని రాష్ట్రాలతో తెలంగాణకు అనుసంధానం పెరిగింది.
ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది.
దేశంలో నిర్మించే 5 టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం.
హన్మకొండలో నిర్మించే టెక్స్టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
ములుగు జిల్లాలో 900 కోట్లతో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు