
టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నారా భువనేశ్వరి గాంధీ జయంతి రోజున సత్యమేవ జయతే పేరుతో నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు భువనేశ్వరి నిరససన దీక్ష చేపడతారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ ఏరియాలో ఈ దీక్ష జరుగుతుంది. దీనికి మద్దతుగా టీడీపీ నాయకులు, శ్రేణులు భారీ ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.