

మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, వికరాబాద్, మెదక్, సంగారెడ్డి, నల్లొండ, సూర్యపేట, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. మిగితా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
హైదరాబాద్లో బుధ, గురు వారాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. సోమవారం సాయంత్రం సిటీలో వర్షం దంచి కొట్టింది. రెండు గంటల వ్యవధిలోనే ఐదు సెంటీ మీటర్ల వాన పడింది. దాంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యి జనం ఇబ్బందులు పడ్డారు.
