

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఈ నెల 30వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. కొల్లాపూర్లో జరిగే సభకు ఆమె హాజరవుతారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు పలువురు నేతలు ఈ సభలో కాంగ్రెస్లో చేరుతారు. ఈ సందర్భంగా ప్రియాంకా గాంధీ మహిళా డిక్లరేషన్ విడుదల చేస్తారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మహిళల కోసం ఏం చేస్తారో ఈ డిక్లరేషన్లో పొందుపరుస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
కాగా 29వ తేదీన గాంధీ భవన్ ఆవరణలోని ప్రకాశం హాల్లో మణిపూర్ ఘటనలపై ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మణిపూర్లో ఆదివాసీల ఊచకోతపై కాంగ్రెస్ నేతలతోపాటు మేధావులు పాల్గొని మాట్లాడుతారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.