
🔹 57 ఎస్సీ ఉపకులాల ‘ఆత్మగౌరవ సభ’
🔹 ముఖ్య అతిథిగా ప్రకాశ్ అంబేద్కర్
🔹 సికింద్రాబాద్ దోబీఘాట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ
🔹 దళిత ఉపకులాల ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బైరి వెంకటేశం
హైదరాబాద్:
దళిత ఉపకులాలు కలిసి కట్టుగా నిలబడి తమ హక్కులు సాధించుకోవాలని డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ అన్నారు. దారిద్ర రేఖ దిగువన ఉన్న ప్రజలకు పథకాలు చేరడం లేదన్నారు. తమ సత్తా చాటేందుకు ప్రతి ఒక్కరు నిబద్దతతో పని చేయాలన్నారు. 57 దళిత ఉప కులాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని దోబీఘాట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. 70 ఏళ్లుగా దళితుల జీవనం మెరుగపడక పోవడం చాలా బాధాకరమని అన్నారు. తమ సత్తా చాటేందుకు ప్రతి ఒక్కరు నిబద్దతతో పని చేయాలన్నారు. 57 దళిత ఉప కులాల ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని దోబీఘాట్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో ముఖ్య అతిథిగా ప్రకాశ్ అంబేద్కర్ పాల్గొన్నారు.
తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ‘ఆత్మగౌరవ సభ’ నిర్వహించినట్టు ‘ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి’ వ్యవస్థాపక అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దళితుల్లో మాల, మాదిగ కులాలు కాకుండా అత్యంత వెనుకబడిన 57 ఉప కులాలు అట్టడుగుస్థాయిలో ఉండి అభివృద్ధికి, అధికారానికి దూరమై ఎలా కొట్టుమిట్టాడుతున్నాయో ఈ సభలో తమ ఆవేదనను బైరి వెంకటేశం వివరించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో ఇంకా కూడు, గుడ్డ, నీడ లేని అట్టడుగు వర్గాల ప్రజల జీవన విధానాన్ని ప్రభుత్వాలకు ఈ సభలో తెలిపారు. అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రభుత్వాలు కృషి చేయాలంటూ ఎస్సీ ఉప కులాల సంక్షేమం కోసం పలు డిమాండ్లు పెట్టారు. ఇప్పటివరకు ఎక్కడ కూడా ఎస్సీ ఉపకులాలకు దళితబంధు అందలేదని, దళితబంధులో ఉప కులాలకు 40 శాతం కేటాయించాలని, ఎస్సీ ఉప కులాలకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెంటనే రూ. 2 వేల కోట్ల నిధులను కేటాయించాలని, నామినేటెడ్ పదవుల్లో రెండు ఎమ్మెల్సీ, ఒక రాజ్యసభ స్థానాన్ని ప్రకటించాలని, వచ్చే ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ తమ సామాజిక వర్గాలకు 6 స్థానాలు కేటాయించి న్యాయం చేయాలని, తమ కుల ధృవీవరణ పత్రాలు ఆర్డీవో ద్వారా కాకుండా ఎమ్మార్వో ద్వారా కేటాయించాలని బైరి వెంకటేశం డిమాండ్ చేశారు.
తెలంగాణలో 22 లక్షల జనాభా కలిగి, దళితులలో 34 శాతం ఉన్న దళిత ఉపకులాలు విద్యా, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అవకాశాలలోనూ అత్యంత వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంచార జీవనానికి, కళారూపాల ప్రదర్శనకు, చేతివృత్తులతో పూట గడవడమే గగనం అన్నట్టు జీవిస్తున్నారని తెలిపారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అత్యంత వెనుకబడి ఉండి, కనీస గుర్తింపుకు నోచుకోవడం లేదన్నారు. ఇప్పటికీ కుల ధృవీకరణ పత్రాలు సకాలంలో అందుకోలేని పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ ఉపకులాల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో త్వరలోనే ఎస్సీ ఉపకులాల యుద్దాభేరి మహాసభను నిర్వహించి మా సత్తా చాటుతామన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ ట్రైకార్ మాజీ చైర్మన్ టీ. ఆర్. రామప్ప, చాగంటి సంజయ్ ఐ. ఆర్. ఎస్ , కత్తి మల్లయ్య, గవ్వల శ్రీకాంత్,ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి నాయకులు నిరగొండ బుచ్చన్న గోసంగి, రాయల లక్ష్మినారాయణ చిందు, తులసిదాస్ గైక్వాడ్ మాంగ్, బ్యాగర కేశవులు, కర్నే రామారావు డక్కలి, దొంబర దివాకర్, టీఎన్ స్వామి మిత అయ్యాల్వర్, కురువ విజయ్ కుమార్ మదాసి కురువ, బుద్ధుల గంగనర్సయ్య మాష్టిన్, నాగిళ్ళ కిష్టయ్య,మల్లు ప్రసాద్ మాల దాసరి,మటపతి నాగయ్య స్వామి బేడజంగం, గడ్డం సమ్మయ్య చిందు, సిరిపాటి వేణు బుడగ జంగం, పురం శివశంకర్ మాలజంగం, కొండయ్య హోళియదాసరి, బచ్చలి బాబు బైండ్ల, రాజారామ్ డక్కలి, గడ్డం చిరంజీవి, పోలేంటి సాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు గంటా రామకృష్ణ పైడి, సుంకన్న, దుపం సత్యం బేడజంగం, దిబ్బనకంటి రంగన్న మదారి కురువ, శివయ్య, లక్ష్మణ్ మోచి, నరేంద్రనాథ్ మాదిగదాసు, యెషపోగు బాబు డక్కలి, కర్నె శ్రీనివాస్,పెద్దయ్య మదాసి కురువ, పద్మావతి దొంబర, వివిధ జిల్లాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.