
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడు తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. ఎర్రబెల్లిని గెలిపించేంత వరకు నిద్రపోనని దీక్ష పూనారు. ఇందులో భాగంగా ఆయన అర గుండు, అర మీసంతో ప్రతిన పూనారు. నల్లకుంట తాండా గ్రామ పంచాయితీ ఆరవ వార్డు సభ్యుడైన అజ్మీరా సోమ్లా నాయక్ అర గుండు కొట్టించుకున్నారు. అర మీసం తీసుకొన్నారు. ఎర్రబెల్లి విజయం సాధించే వరకు ఇలాగే కొనసాగుతానని మీసం మెలేశారు. అప్పటి వరకు తన దీక్ష విరమించనని భీష్మించుకొని కూర్చుకున్నారు. ఇలాంటి దీక్ష వినూత్నంగా ఉండడం విశేషం. రాష్ట్రంలో ఏ నాయకుడి కోసం ఇంతటి కఠినమైన దీక్షకు పూనుకోవడం గమనార్హం.